మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో 36వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగారం అతిథిగృహంలో నేడు ఆరుగురు అనుమానితులను సీబీఐ ప్రశ్నిస్తోంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, మరో డ్రైవర్ ప్రసాద్, వాచ్‌మెన్ రంగన్న తోపాటు పులివెందులకు చెందిన మరో ఇద్దరు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. 36 రోజుల సీబీఐ విచారణలో మాజీ డ్రైవర్ దస్తగిరిని 20 రోజుల పాటు, ఎర్రగంగిరెడ్డిని రెండు వారల పాటు విచారణకు పిలిచారు. వాచ్‌మెన్ రంగన్న వరుసగా రెండో రోజు విచారణకు హాజరయ్యారు. హత్యజరిగిన రోజు వివేకా ఇంటివద్ద రంగన్ననే కాపలా ఉన్నారు. వాచ్‌మెన్ రంగన్న, ఎర్రగంగిరెడ్డిని గతంలో సిట్ అధికారులు... గుజరాత్ తీసుకెళ్లి నార్కో పరీక్షలు సైతం నిర్వహించారు.
వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో హంతకులెవరనేది పోలీసులు తేల్చలేదు. వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో... న్యాయస్థానం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
ఇదీ చదవండి