కడప జిల్లాలోని కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పుణ్యక్షేత్రం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరించేందుకు పీఠాధిపతులు అక్కడికి చేరుకున్నారు. వారంతా ఉదయాన్నే బ్రహ్మంగారి ఆలయం, పక్కనే ఉన్న ఈశ్వరీదేవి మఠాన్ని దర్శించుకున్నారు. ప్రొద్దుటూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాన్ని సందర్శించిన అనంతరం తిరిగి బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు.
మఠం పీఠాధిపతి విషయంలో కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ దివంగత పీఠాధిపతి వసంత వెంకటేశ్వరస్వామి భార్య మారుతీ మహాలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
Brahmamgari Matham: బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతులు.. పోలీసుల అనుమతి నిరాకరణ