ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్రహ్మంగారిమఠంలో జరగరాని పరిణామాలు జరుగుతున్నాయని..ఈ ఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకునేందుకు తాను వెళ్లి అక్కడున్న విశ్వబ్రాహ్మణులతో మాట్లాడుతుండగా ఇంతలో ఓ వర్గం వారు వచ్చి తనపై దాడికి యత్నించారని అన్నారు. సకాలంలో పోలీసులు వచ్చి అదుపుచేశారని తెలిపారు.
'నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదని.. ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తన వైఖరిని వెల్లడించాను. అయినప్పటికీ మఠంలో జరగరాని ఘటనలు జరుగుతున్నాయని.. రేపు పీఠాధిపతిగా ఎవరూ ఎన్నికైనా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కావున పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి' అని శ్రీకాంత్.. ఎస్పీకి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి..