ETV Bharat / state

పేలుళ్లతో వణుకుతున్న పల్లెలు.. ముగ్గురాయి గనిలో ఎడతెరపి లేకుండా పనులు - కడప జిల్లాలో మైనింగ్ తవ్వకాలు తాజా వార్తలు

అవి పచ్చని పల్లె సీమలు... పాడి పంటలతోనే అక్కడి అన్నదాతలకు జీవనాధారం. దశాబ్ధన్నర కాలంగా తరచూ పేలుళ్లతో ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయానక జీవనం వారిది. పేలుడు పదార్థాలకు అనుమతులు లేకున్నా రాజకీయ బలం అధికారుల సహకారంతో కథ నడచిపోతోంది. కలసపాడు మండలం మామిళ్లపల్లె ముగ్గురాయి గనుల పేలుళ్ల ప్రభావం ఏడు గ్రామాలపై పడింది.

మైనింగ్ తవ్వకాలు
మైనింగ్ తవ్వకాలు
author img

By

Published : May 14, 2021, 3:37 PM IST

ఈ మండలంలో 13 గ్రామ పంచాయతీలు, నలభై వేల జనాభా ఉన్నారు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలో మాత్రం ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితి లేదు. అక్కివారిపల్లె, మహనందిపల్లె గ్రామ పంచాయతీలో మహనందిపల్లె మామిళ్లపల్లె, మహబూబ్‌నగర్‌, లింగారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో లింగారెడ్డిపల్లె, కరణంవారిపల్లె, హృదయపేట, శంఖవరం, గ్రామాలు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముగ్గురాయి గనిలో ఎడతెరపి లేకుండా పనులు సాగుతుండటంతో పేలుళ్ల కారణంగా పెద్ద శబ్ధాలతో పాటు భూమి కంపించినట్లు ఉండటంతో భయపడుతూ పల్లె జనం దినదినగండంగా కాలం గడుపుతున్నారు. సమీపంలోని పశువులను మేతకు అడవీ ప్రాంతాలకు వెళ్లాలన్నా పేలుళ్లతో భయపడుతున్నారు. మామిళ్లపల్లె ముగ్గురాయి గనులు వద్ద ఎలాంటి రక్షణ కంచె లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొండ ప్రాంతం మారుమూల ఉండటంతో ఇంటికి సమాచారం ఇచ్చేవారుండరు.

పెద్ద పెద్ద శబ్ధాలతో భయం

వ్యవసాయంపై ఆదారపడి జీవనం సాగిస్తున్నాను.పెద్ద శబ్దాలు వచ్చినపుడు భూమి కంపించినట్లు ఉంటుంది. ఎప్పుడు పేలుస్తారో తెలియదు. పశువులు మేతకు సమీనంలోని కొండకు వెళ్తాయి. ఇంటికి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితి. పేలుళ్లు లేకుండా పల్లె జనం ప్రశాంతమైన జీవనం సాగేందుకు చర్యలు చేపట్టాలి. - గురయ్య రైతు, లింగారెడ్డిపల్లె కలసపాడు మండలం

పేలుళ్లతో ఆందోళన

ముగ్గురాళ్ల గనుల్లో తరచు పేలుళ్లు జరుపుతుంటారు. ఆ శబ్ధం మా గ్రామం వరకు వినిపిస్తుంది. భూకంపం వచ్చిందేమన్న అనుమానం వస్తుంది. అధికారులు గ్రామాలకు చేరువలో పేలుళ్లు జరపకుండా ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి. అక్కడ పేలుడు పదార్థాలకు అనుమతులు లేకున్నా జరపడం వల్ల పది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు.

ఇవీ చూడండి…: రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సీఎం నమ్మకం : అంజాద్ బాషా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.