ETV Bharat / state

అక్కడ 40 ఏళ్లుగా ఎన్నికలు లేవు..! - 40ఏళ్లుగా ఎన్నికలు జరగని శేషారెడ్డి పల్లె తాజా వార్తలు

ఎన్నికలంటేనే పోలీసులకు కత్తి మీద సాము. ఇక ఫ్యాక్షన్​కు పెట్టింది పేరైన కడప లాంటి జిల్లాలో అయితే పరిస్థితి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కానీ ఆ గ్రామంలో పరిస్థితి ఇందుకు విరుద్ధం. ఎన్నికల మాటే ఉండదు. పోటీ అన్న పదమే వినిపించదు. దశాబ్ధ కాలంగా ఆ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదంటే నమ్మశక్యంగా లేదు కదూ.. అయినా కూడా అది నిజమే.

no elections in last 40 years
40 ఏళ్లుగా ఎన్నికలు లేవు
author img

By

Published : Feb 3, 2021, 5:56 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ఫ్యాక్షన్. ఎన్నికల సమయంలో ఘర్షణలు, గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అలాంటి ప్రాంతంలో 40 ఎళ్లుగా అందరూ ఒకమాటపై ఉంటూ సర్పంచ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శేషారెడ్డి పల్లె వాసులు.

జిల్లాలో ఆదర్శ గ్రామం..

శేషారెడ్డి పల్లె.. రాళ్ల గుండ్లకుంట అని కూడా పిలిచే ఈ గ్రామంలో 600 మందికి పైగా నివాసముంటారు. ఈ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం ఎప్పుడు ఎన్నికలు జరుగవు. గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. జమ్మలమడుగు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం స్వచ్ఛందంగా మద్యం నిషేధించటంతోపాటు.. ఇతర చెడు వ్యసనాలను బహిష్కరించి.. జిల్లాలో ఆదర్శ గ్రామంగా నిలిచింది. 40 ఏళ్ల చరిత్ర గల శేషారెడ్డి పల్లికి ఇప్పటి వరకూ నలుగురు సర్పంచులుగా వ్యవహరించారు. ఈ గ్రామ పోలీస్ రికార్డులో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం గమనార్హం.

ఈసారి అక్కడ సర్పంచ్​గా పనిచేసే అవకాశం మహిళకు వచ్చింది. దీంతో గ్రామస్థులంతా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏకగ్రీవంగా అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చూడండి...: ఎన్నికలకు దూరంగా ఆ ఆరు గ్రామాల ప్రజలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.