ETV Bharat / state

కడపజిల్లాలో సచివాలయ పరీక్షల విస్తృత ఏర్పాట్లు - గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ

గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.

village secretariat examinations arrangements complited at kadapa district
author img

By

Published : Aug 31, 2019, 10:06 AM IST

కడపజిల్లాలో గ్రామ సచివాలయ పరీక్షల ఏర్పాట్లు పూర్తి.

కడపజిల్లాలో గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షా 44 వేల మంది అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబరు 1వ తేదీన లక్ష మంది పరీక్ష రాస్తుండగా... వాటికోసం 300 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 7 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారన్నారు. రేపు పరీక్షల మెటీరియల్స్​ను ఆయా పోలీసు స్టేషన్లకు తరలించి భద్ర పరుస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తామని తెలిపారు. అభ్యర్థులెవరూ వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామ సచివాలయ పరీక్షలు కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని... ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని చెప్పారు. మధ్యవర్తులు మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి ఎవరూ మోసపోవద్దని హితవు పలికారు.

ఇదీచూడండి.'ఇసుక కొరత తీర్చండి...కార్మికులను ఆదుకోండి'

Intro:AP_TPG_21_30_MLA_COMMENTS_SAND_TDP_DHARNA_AVB_AP10088
యాంకర్: సెప్టెంబర్ ఐదు నాటికి నూతన ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో నా ఊపిరి ప్రకృతి తో మొదటి బంధం అనే కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మొక్కలు నాటించారు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఏలూరు ఎంపీ శ్రీధర్ అన్నారు ప్రతి విద్యార్థి తన పుట్టిన రోజున ఒక మొక్క నాటి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం హయాంలో 8 నెలల తర్వాత ఇసుక విధానం అమల్లోకి వచ్చిందని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం నెలలు కూడా పూర్తి చేయలేదన్నారు ఈ లోపల కావాలని తెదేపా నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు ప్రజా సమస్యలకు ఎవరు ఆటంకం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు
బైట్స్:
కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ
ఎలిజా చింతలపూడి ఎమ్మెల్యే

Body:ఎమ్మెల్యే కామెంట్స్ సాండ్ టీడీపీ ధర్నా

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.