కడప జిల్లా జమ్మలమడుగు, మైలవరం మండలాల పరిధిలో.. విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాలతో పాటుగా.. షాపింగ్ మాల్స్, రేషన్ దుకాణాల్లో విజిలెన్స్ సీఐ లింగప్ప, ఏఓ సురేషన్, తూనికలు కొలతల శాఖ అధికారి శంకర్ సంయుక్తంగా దాడులు జరిపారు.
జమ్మలమడుగులోని ఓ షాపింగ్ మాల్లో సరుకులపై తయారీ తేదీలు, సంబంధిత వివరాలు లేకపోవడంపై కేసు నమోదు చేశారు. మైలవరం మండలం, వేపరాల గ్రామంలోని రేషన్ దుకాణాల్లోనూ తనిఖీలు చేశారు. కొలతల్లో తేడాలు రావొద్దని అందరికీ తెలియజేశారు.
ఇవీ చూడండి: