ETV Bharat / state

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని చెర్లోపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలోని సొరంగ మార్గాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించనున్నారు.

నేడు కడప జిల్లాలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన
author img

By

Published : Aug 30, 2019, 11:43 PM IST

Updated : Aug 31, 2019, 12:57 AM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు నెల్లూరు జిల్లా వెంకటాచలం నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరి... సాయంత్రం 5 గంటలకు కడప జిల్లాలోని చెర్లోపల్లి రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. అక్కడినుంచి సమీపంలోని 7కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని వెంకయ్య పరిశీలిస్తారు. అరగంటపాటు సొరంగ మార్గాన్ని పరిశీలించిన అనంతరం... అదే ప్రత్యేక రైల్లో వెంకటాచలం వెళ్తారని అధికారులు తెలిపారు. ఇటీవలే కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వేలైన్ ప్రారంభమైంది. ఈ మార్గంలో ప్రత్యేక గూడ్స్​ రైలు కూడా నడుస్తోంది. 7కిలోమీటర్ల సొరంగ మార్గం, కృష్ణపట్నం-ఓబులవారిపల్లె రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి వెంకయ్యనాయుడు ప్రత్యేక కృషి చేశారు.

ఇదీ చదవండీ...'ఆంధ్రాబ్యాంక్​'... ఇక కనపడదు

Intro:శ్రీ కాళహస్తి ఈశ్వరాలయం లో హుండీ లెక్కింపు తో రూ. కోటి ఆదాయంBody:చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరా లయం లో 30 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం రూ. 1,28,36000 వచ్చింది. స్వామి, అమ్మవారులు, పరివాహక దేవతా మూర్తుల హుండీలను ఈ వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ. 1,28,36000 రాగా, 69 గ్రాములు బంగారు, 508 కేజీలు వెండి, 212 నోట్లు విదేశీ కరెన్సీ వచ్చింది.Conclusion:శ్రీకాలహస్తీస్వరాలయం లో హుండీలు లెక్కింపు.. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
Last Updated : Aug 31, 2019, 12:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.