కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు కరోనా నేపథ్యంలో సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. కేవలం 200 మంది దర్గా నిర్వాహకుతో ఈ వేడుకలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రాత్రి దర్గా పీఠాధిపతి హుసేనీ.. పూల చాదర్‌ను సమర్పించారు.
ఫకీర్ల విన్యాసాలతో డప్పులు వాయిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా దృష్ట్యా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి: