హైదరాబాద్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని యూసఫ్‌గూడ ఎల్ఎన్ నగర్లో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడిని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన నాగేంద్రబాబుగా గుర్తించారు. మద్యానికి బానిస కావడమే కాకుండా, ఆన్లైన్లో బెట్టింగులు ఆడేవాడని మృతుడి భార్య తెలిపింది. మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...