కడప జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. కళ్లు కూడా తెరవని పసిగుడ్డును రోడ్డుపైన వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం అర్ధరాత్రి గున్నికుంట్ల రహదారి వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. అయితే ఆ పసిగుడ్డు ప్రాణాలతో లేదు. ముందుగానే చనిపోయిందా లేక వదిలేసిన తర్వాత మృతిచెందిందా అనే విషయంపై స్పష్టత లేదు.
రోడ్డు పక్కన శిశువును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసిగుడ్డును పరిశీలించి.. పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. ఏం జరిగింది, ఎవరు వదిలి వెళ్లారు అనే దానిపై ఆరా తీయకుండానే పోలీసులు అలా అప్పగించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..