ETV Bharat / sports

'టీమ్ఇండియా​తో పాంటింగ్​కు ఏం సంబంధం? ఎవరి పని వాళ్లు చూసుకుంటే బెటర్!'

పాంటింగ్​కు గంభీర్ కౌంటర్- రోహిత్, విరాట్ ఫామ్​లో ఎలాంటి ఆందోళన లేదన్న కోచ్

Gambhir On Ricky Ponting
Gambhir On Ricky Ponting (Source : AP (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Nov 11, 2024, 11:19 AM IST

Gambhir On Ricky Ponting : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియా బయల్దేరింది. ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది. నవంబర్ 22న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోమవారం ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడు. ఇటీవల విరాట్ కోహ్లీ ఫామ్​పై కామెంట్స్ చేసిన​ ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్​కు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

'గత ఐదేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో మూడు సెంచరీలే బాదాడు. అతడి ఫామ్​పై నేను ఆందోళన చెందుతున్నా' అని ఇటీవల ఐసీసీ పాడ్​కాస్ట్​లో మాట్లాడాడు. అయితే దీనికి గంభీర్ తాజా ప్రెస్​మీట్​లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్​పై తనకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. భారత క్రికెట్​తో పాంటింగ్​కు సంబంధం లేదని అన్నాడు.

'భారత క్రికెట్​తో రికీ పాంటింగ్​కు ఏం సంబంధం? అతడు ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిది. నాకు విరాట్, రోహిత్ ఫామ్​పై ఎలాంటి ఆందోళన లేదు. వాళ్లిద్దరు చాలా సాధించారు. ఇండియన్ క్రికెట్​కు ఎంతో సేవ చేశారు. ఇప్పటికీ వాళ్లలో పరుగుల దాహం ఉంది. అందుకు చాలా కష్టపడుతున్నారు కూడా' అని గంభీర్ అన్నాడు.

'పరిస్థితులు చాలా కఠినం. భారత్‌తో పోలిస్తే చాలా విభిన్నం. కానీ, ఆస్ట్రేలియాలో ఆడిన అనుభం కలిసి వస్తుంది. అది సపోర్ట్‌ స్టాఫ్‌కైనా, ప్లేయర్లకైనా. ఈ సిరీస్‌లోనూ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం' అని గంభీర్ పేర్కొన్నాడు.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్‌ కుమార్, నవ్‌దీప్‌ సైని, ఖలీల్ అహ్మద్

రోహిత్ గురించి ఇప్పడే ఏం చెప్పలేం- హిట్​మ్యాన్ లేకపోతే కెప్టెన్ అతడే!

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ: జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా- టీమ్​లోకి కొత్త కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.