AP Assembly Budget Session 2024 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు శాసనసభకు చేరుకున్నారు. చంద్రబాబు అధ్యక్షతన శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-25 వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ ముగిసింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
అంతకుముందు గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు నాయుడు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేశ్, పార్థసారథి, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, సవిత, టీటీడీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. రాజధాని అమరావతి రైతులను నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ రైతులను అభినందించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని తెలుగుదేశం నేతలు తెలిపారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై చర్చించేందుకైనా దమ్ముంటే ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావాలంటూ ఆ పార్టీ నేతలు సవాల్ చేశారు.
లైవ్ LIVE UPDATES : ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. మరికాసేపట్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచుతారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ (Vote on Account Budget)ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తున్నారు.
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ - శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
రైతులకు గుడ్‌న్యూస్ - వ్యవసాయ రంగానికి రూ.43,402 కోట్ల కేటాయింపులు