కడప పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు సంఘటనల్లో ఓ వివాహిత, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి కనిపించకుండా పోయారు. జిల్లాలోని రవీంద్రనగర్‌కు చెందిన వివాహిత తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు ఆమె కోసం వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఈ నెల 25వ తేదీన ఇంటి నుంచివెళ్లి.. ఈ రోజు వరకూ తిరిగి రాలేదు. అమ్మాయి తల్లిదండ్రులు.. బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఫలితం లేకపోయింది. అదృశ్యమైన వ్యక్తుల బంధువులు, తల్లిదండ్రుల నుంచి రెండు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు…. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: