పాములు సయ్యాటలాడటం చూస్తుంటాం కానీ.. కడప జిల్లా మైదుకూరు మండలం గంజికుంట గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశస్వామి ఆలయం ఆవరణలో మాత్రం శనివారం రెండు కొండచిలువలు సయ్యాటలాడుతూ కనిపించాయి.
ఆలయ ఆవరణంలోని పూజారి కుటుంబంతోపాటు.. అక్కడికి చేరుకున్న స్థానికులు కొందరు కొండ చిలువల సయ్యాటను దూరం నుంచి చూస్తూ ఉండిపోయారు. దగ్గరగా వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఆలయం వద్దకు వెళ్లిన మైదుకూరు వాసి ఒకరు దీనిని తన చరవాణిలో చిత్రీకరించారు.
ఇదీ చదవండి: ''420కి సవాల్ విసిరితే.. 840 ఎందుకు స్పందిస్తుందో ?