ETV Bharat / state

కారు-ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు కూలీలు మృతి - news updates in kadapa district

రోజంతా కష్టపడి ఇళ్లకు వెళ్లి సేద తీరాలనుకున్న కూలీలపై మృత్యువు పగబట్టింది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న వారిని కారు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన కడప జిల్లా ఇడమడకలో జరిగింది.

two people death in a road accident at idamadaka kadapa district
కారు-ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు కూలీల మృతి
author img

By

Published : Apr 16, 2021, 3:56 PM IST

కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక గ్రామానికి చెందిన కూలీలు రవణయ్య, బాలనాగమ్మ, మాధవి పని ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న కారు.. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవణయ్య, బాలనాగమ్మలు మృతి చెందగా.. మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రురాలిని కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచదవండి.

రాష్ట్రంలోని కొన్ని శాఖల అధికారుల హోదాల్లో మార్పులు

కర్ణాటక ముఖ్యమంత్రికి రెండోసారి కరోనా

'సెహరి' టీజర్​.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.