వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట బీసీ బాలికల సమీకృత వసతి గృహంలో జరిగింది. వసతి గృహ వార్డెన్ శోభారాణి అందించిన సమాచారం మేరకు.. ఈనెల 1న ఉదయం అల్పాహారం తినే సమయంలో 42 మంది విద్యార్థులు ఉండగా భోజన సమయానికి 40 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని.. ఇద్దరు విద్యార్థినులు తప్పిపోయినట్లు గుర్తించామని హాస్టల్ వార్డెన్ చెప్పారు.
కడపకు చెందిన స్వధార్ సంస్థ 3 నెలల క్రితం ఓ బాలికను వసతి గృహంలో చేర్చిందని తెలిపారు. ఆ బాలికకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పాఠశాలలో చేర్పించలేదని చెప్పారు. రాజంపేట పట్టణానికి చెందిన మరో బాలిక ఐదో తరగతి చదువుతోందన్నారు. ఘటనపై రాజంపేట ఫిర్యాదు చేశామన్నారు. పిల్లల ఆచూకీ కోసం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాలన్నారు.
ఇదీ చదవండి: