కడప నగరంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకట పట్టణ ఠాణా పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కడప మోచంపేటకు చెందిన మురళీకృష్ణ(57) రామకృష్ణ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. మంగళవారం సాయంత్రం మురళీకృష్ణ మోచం పేట నుంచి నడుచుకుంటూ వస్తుండగా మార్గమధ్యంలో కింద పడడంతో తలకు గాయమైంది. వెంటనే 108లో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా.. చికత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో రాడ్ బెండర్ మృతి..
విద్యుదాఘాతంతో రాడ్ బెండర్ మృతి చెందిన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన భత్రా(25) మూడు నెలల కిందట కడపకు వచ్చి రాడ్ బెండర్ పనిచేస్త జీవనం సాగిస్తున్నాడు. బుధవారం కడప విద్యుత్తునగర్లో ఓ ఇంటి నిర్మాణం కోసం ఇసుప చువ్వలు తీస్తుండగా అవి కరెంటు తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై భత్రా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేలిన గ్యాస్ సిలిండర్..
కడప మేకలదొడ్డి వీధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షేక్ ముస్తఫా కుటుంబ సభ్యులు రాత్రి వంట చేస్తుండగా.. గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది. షేక్ ముస్తఫా, ఖాజాతో పాటు మరొక బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Power Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక