కడప జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం శని, ఆదివారాలు రద్దు చేసింది. కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజు లాక్డౌన్ నిర్వహించడం డిపో నుంచి శనివారం రాత్రి వెళ్లే మూడు బస్సు సర్వీసులను, ఆదివారం మధ్యాహ్నం వరకు వెళ్లే మరో మూడు బస్సు సర్వీసులను రద్దు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు యథావిధిగా బస్సు సర్వీసులు అన్నింటినీ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ వరకు ఈ విధానం ఉంటుందని, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి... : ‘రౌండ్ ట్రిప్ ట్రాఫిక్’ రైల్వే సరకు రవాణా ప్రారంభం