కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతు బిల్లులు తేనె పూసిన కత్తి లాంటివని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ పేరుగా మార్చారని విమర్శించారు. రైతులు కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం చేస్తూ సంతోషంగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను ప్రవేశపెట్టడం రైతుల మెడకు ఉరి తాడు అయ్యిందని పేర్కొన్నారు. అప్పటినుంచే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పతనం మొదలైందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఇదీ చదవండి: అమరావతి ఐకాస జైల్ భరో...అడ్డుకుంటున్న పోలీసులు