ETV Bharat / state

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి: తులసిరెడ్డి - తులసిరెడ్డి తాజా వార్తలు

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని.. లేకుంటే సీమాంధ్ర ఎడారవుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 4న జరగబోతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో సమర్థవంతమైన వాదనలు వినిపించి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలి: తులసిరెడ్డి

author img

By

Published : Jun 2, 2020, 3:14 PM IST

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని..లేకుంటే సీమాంధ్ర ఎడారవుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 4న జరగబోతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో సమర్థవంతమైన వాదనలు వినిపించి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

1976 మేలో బచావత్​ ట్రిబ్యునల్.. కృష్ణా నదిలో ఏడాదికి 2130 టీఎంసీల నికరజలాలు ఉంటాయి అని నిర్ధరణకు వచ్చి అందులో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 811 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. 811 టీఎంసీల నికర జలాలలో ప్రాజెక్టుల వారీగా తెలంగాణకు 299 టీఎంసీలు, సీమాంధ్రకు 512 టీఎంసీలు కేటాయించారన్నారు.

తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టుల కారణంగా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి జిల్లాల్లోని భూములు ఏడారిగా మారుతాయన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తటంతో పాటు జల ఉత్పత్తి ఆగిపోతుందన్నారు. పరిశ్రమలు మూతపడి ఏడారిగా మారుతాయని వాపోయారు. కాబట్టి జూన్ 4న ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డు ముందు సమర్థవంతమైన వాదనలు వినిపించాలని కోరారు. లేకుటే సీమాంద్ర ద్రోహిగా వైకాపా ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని ఆక్షేపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.