ETV Bharat / state

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా? మీకున్న సమస్యలేంటి? - ప్రభుత్వం సర్వే - GOVT SURVEY ON WORK FROM HOME

రాష్ట్రంలో వర్క్‌ ఫ్రం హోం విధానం అభివృద్ధికి చర్యలు - ఇంటింటి సర్వే ప్రారంభించిన ప్రభుత్వం

Govt_Survey_on_Work_from_Home
Govt_Survey_on_Work_from_Home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2025, 9:08 AM IST

AP Govt Survey on Work from Home Policy: రాష్ట్రంలో 'వర్క్‌ ఫ్రం హోం' విధానాన్ని విస్తృతపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇంటింటికెళ్లి మీరు 'వర్క్‌ ఫ్రం హోం' చేస్తున్నారా? మీకున్న సమస్యలేంటి? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉండి, ఆధునిక సాంకేతికాంశాలపై అవగాహన, విద్యార్హత కలిగిన వారికి 'వర్క్‌ ఫ్రం హోం' ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం నుంచి సర్వే చేపట్టింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సచివాలయాల సిబ్బంది వెళ్లి వారి వివరాలు సేకరించనున్నారు. వచ్చే నెల 10 నాటికి ఈ సర్వే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేయనుంది. వివిధ సంస్థల ద్వారా ప్రస్తుతం ఇళ్ల నుంచి పని చేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, దాని స్పీడ్, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను ఈ సర్వేలో గుర్తించనున్నారు. ఇంక తగిన విద్యార్హత కలిగిన వారు ఐటీ/ఐటీఈఎస్‌/ఇతర అనుబంధ సంస్థల్లో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారా అనేది తెలుసుకోనున్నారు.

వారికి ఇంటి నుంచే పని చేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి వర్క్‌ ఫ్రం హోం సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్‌ భవనాలు అందుబాటులో ఉన్నాయా అనే వివరాలనూ సేకరిస్తారు. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది వర్క్‌ ఫ్రంహోం చేసేందుకు సుముఖంగా ఉంటే అలాంటిచోట ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో 20 నుంచి 25 మంది వరకు పని చేసేలా సదుపాయాలు కల్పించనుంది. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తుంది.

నెయ్యిలో రసాయనాలు కలిపా - సిట్​ విచారణలో అపూర్వ చావడా!

మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం : సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.