ETV Bharat / state

విద్యుత్​ బిల్లుల పెంపునకు నిరసనగా మూడు గంటల దీక్ష - తులసి రెడ్డి తాజా వ్యాఖ్యలు

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా, నాలుగు నెలల పాటు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసీరెడ్డి దీక్ష చేపట్టారు. ఆయన స్వగృహంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు మూడు గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు.

tulasi reddy three hours strike
విద్యుత్​ బిల్లుల పెంపునకు నిరసనగా మూడు గంటల దీక్ష
author img

By

Published : May 14, 2020, 3:41 PM IST

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసిస్తూ, నాలుగు మాసాల పాటు విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. మూడు గంటల పాటు కడప జిల్లా వేంపల్లిలోని ఆయన స్వగృహంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు దీక్ష చేశారు. ప్రజలు, రైతులు, రైతు కూలీలు, ఇబ్బందులు పడుతుంటే జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం వడ్డింపులు, వాయింపుల అన్నట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. గత 11 నెలల కాలంలో మద్యం మీద మూడుసార్లు, సిమెంట్ మీద రెండుసార్లు, బస్సు చార్జీలతోపాటు డీజిల్ మీద చార్జీలు పెంచారని మండిపడ్డారు.

ఇవీ చూడండి...

'తూకంలో తేడా వస్తే... మెట్టుతో కొట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.