కమీషన్ల కోసమే రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మద్య నిషేధం చేయాలని అన్నారు. అంతేకానీ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ధరలు పెంచడం వలన మద్యపాన నిషేధం జరుగుతుందని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తులసి రెడ్డి అన్నారు.
మోదీ జీఎస్టీ అంటే జగన్మోహన్ రెడ్డి జేఎస్టీ (జగన్ సర్వీస్ టాక్స్) అంటున్నారని విమర్శించారు. కరోనా ఆర్థిక సహాయం పేరిట పేదలకు పంచింది 1400 కోట్లు రూపాయలు అయితే... ఏజేఎస్టీ వల్ల 4500 కోట్లు తాగుబోతుల కుటుంబాల నుంచి గుంజుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా మద్యం షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి