ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి మీడియా సమావేశం రాష్ట్రంలో పంచముఖ పోటీ నెలకొందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తెలిపారు. తెదేపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రందివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుందనివిమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్తో.. వైకాపా అధినేత జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని తులసిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం థార్ ఎడారి అవుతుందని... రాక్షస రాజ్యంగా మారుతుందని ఆరోపించారు. పోలవరాన్ని అడ్డుకుంటున్న తెరాసతో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
విజయం కోసం.. జతకట్టిన 'జమ్మలమడుగు వైరం'!