Congress Leader Tulasi Reddy on YSRCP Govt: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన ఆయన.. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటినాక బోడి మల్లన్న అన్న చందంగా వైసీపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు సంబంధించి ఐదు ప్రధానమైన అంశాలపై వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు.
1. సీపీఎస్ రద్దు
2. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం
3.సకాలంలో పీఆర్సీ అమలు
4.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం
5.ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించడం
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు హామీలను తుంగలో తొక్కారని.. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించకపోవడమే కాకుండా ఈ మూడున్నర సంవత్సరాల్లో 50వేల మంది కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. ఇంకా రెండు లక్షల 50వేల మందిని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ఉద్యోగులకు సంబంధించి హామీలిచ్చిందో.. వాటిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చదవండి :