కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నిన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం (Southern Zonal Council Meeting) సాధించింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Tulasi Reddy) అన్నారు. సమావేశం వల్ల రాష్ట్రంలో కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయనుకుంటే.. ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు.
రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి నిధులు రావాలంటే అధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. విభజన చట్టంలోని హామీలతో పాటు బహుళార్థక సాధక ప్రాజెక్టైన పోలవరం పూర్తి, కడప ఉక్కు కర్మాగారం, రాష్ట్రంలో కొత్త ఓడరేవు మంజూరు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
ఇదీ చదవండి: SZC meeting: మాదక ద్రవ్యాలను కట్టడి చేయండి: అమిత్ షా