దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజును రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. అయితే కేవలం రైతు మిత్ర పార్టీ అని చెప్పుకోకుండా దానికి తగ్గట్టుగా కార్యాచరణ నిర్వహిస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేస్తూ.. మరోవైపు రైతు దినోత్సవం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇంత వరకూ ప్రభుత్వం బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేయలేదని అన్నారు. వార్షిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక ఇంకా తయారు చేయలేదని.. బడ్జెట్ కేటాయించలేదని గుర్తు చేశారు. ముందు కేటాయించిన బడ్జెట్ను ఖర్చు చేయలేదన్నారు.
రైతు రుణమాఫీ కింద రూ.8 వేల కోట్లు పెండింగ్ ఉందని.. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి ఒకేసారి రూ.5,500 కోత పెట్టి ఇస్తున్నారని మండిపడ్డారు. రబీలో సేకరించిన వరి ధాన్యం రైతులకు ఇప్పటికీ రూ.830 కోట్లు బకాయిలు ఇవ్వలేదని గుర్తుచేశారు. మాటలు తగ్గించి చేతల ద్వారా నిరూపించుకోవాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి: