ETV Bharat / state

'గండికోట నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం తీరు దారుణం'

author img

By

Published : Sep 28, 2020, 5:31 PM IST

గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. పరిహారం ఇవ్వకుండా.. పునరావాసం కల్పించకుండా పొమ్మంటే ఎక్కడికి పోతారని ప్రశ్నించారు.

tulasi reddy comments
tulasi reddy comments

గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని ఏపీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అమానుషంగా, అనాగరికంగా, దుర్మార్గంగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. పరిహారం ఇవ్వకుండా.. పునరావాసం కల్పించకుండా మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వాసితులను ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. నిర్వాసితుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.

  • గండికోట రిజర్వాయర్ నీటి మట్టం ఏమాత్రం పెరగకుండా చూడాలి.
  • పరిహారం ఇచ్చేందుకు కటాఫ్ తేదీని ఇప్పటివరకు 2017 సెప్టెంబర్ 30 పెట్టారు. కానీ పరిహారం ఇవ్వలేదు కాబట్టి 2020 డిసెంబర్ 30 వరకు కట్ ఆఫ్ తేదీని పెంచాలి.
  • ప్రకాశం జిల్లా వెలుగొండ నిర్వాసితులకు పరిహారం కింద 12.30 లక్షల రూపాయలు ఇచ్చారు.. అదేవిధంగా గండికోట నిర్వాసితులకు పది లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. వెలుగొండ నిర్వాసితులకు ఇచ్చినట్టే గండికోట నిర్వాసితులకు ఇవ్వాలి. ఇందు కోసం జీవో జారీ చేయాలి.
  • పరిహారం పూర్తిస్థాయిలో అందరికీ ఇవ్వాలి.
  • పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ఇదీ చదవండి:

రైతులకు ఉచితంగా బోర్లు..ఖర్చంతా ప్రభుత్వానిదే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.