వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లైన సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రొద్దుటూరు రోడ్డులోని మూలబాట నుంచి శ్రీరాంనగర్ మీదుగా వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు.
వైఎస్సార్ విగ్రహానికి పూలు..
అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
ఇప్పుడు అన్నీ పరిష్కరిస్తాం..
గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని, ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం వచ్చినందున సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి : కుటుంబం ఆత్మహత్య కేసు: నంద్యాలకు చేరుకున్న విచారణ కమిటీ