కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల గ్రామంలో బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్టు కూలి ఇంటిపై పడింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు కడవకల్లు వెంకట సుబ్బారావు ఇంటిపై చెట్టుకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...వెయ్యి కోట్లకుపైగా నష్టం