కడపజిల్లా బద్వేల్ ఎన్జీఓ హోంలో ప్రధానమంత్రి పసల్ బీమా పథకంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. రాజంపేట డివిజనల్ వ్యవసాయ గణాంక అధికారి గురు స్వామి ముఖ్య అతిథిగా హాజరై తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలు వివరాలు నమోదు విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ఇవన్నీ సవ్యంగా ఉంటే రైతులకు బీమా సులభంగా అందుతుందని తెలిపారు. ఈ దఫా పంటలు వేయకపోయినా రైతులకు పసల్ భీమా చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వ్యవసాయ అధికారులకు వీఆర్వోలు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు.
ఇదీచూడండి.రైతు రుణమాఫీ అమల్లో ఉంటే చర్యలు తీసుకోండి : హైకోర్టు