మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని నేడు సీఎం జగన్ ఇడుపులపాయలో నివాళుల అర్పించనున్నారు. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకున్న జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లిఅక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాత్రి ఇడుపులపాయకు చేరారు. అక్కడే అతిథిగృహంలో జగన్ బసచేయగా ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందులకు వెళ్లారు. జగన్ కంటే ముందే వైఎస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిళ కూడా రాత్రే ఇడుపులపాయకు వచ్చారు. వీరంతా ఒకే అతిథిగృహంలో ఉన్నారు. వైఎస్సార్ జయంతికి వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిళ....ఇప్పుడు కలిసే నివాళులర్పిస్తారో లేక వేర్వేరుగా పాల్గొంటారోననే చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: