ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీతికి నిజాయితీకి ఆదర్శమని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ఒక క్రీడాకారుడిగా, లాయర్‌గా, రాజకీయ నాయకుడిగా, పరిపాలన అధ్యక్షుడిగా, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి వ్యక్తిత్వం హిమాలయాల వలే ఉన్నతమైనదన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు పార్లమెంట్ సభ్యునిగా అనేకసార్లు రాష్ట్ర మంత్రిగా అనేక పర్యాయాలు కేంద్రమంత్రిగా పని చేశారన్నారు. తక్కువ మాట్లాడటం ఎక్కువ పని చేయటం ఆయన నైజం అన్నారు.
ఇదీచూడండి