వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే... ఆ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకురావటాన్ని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తప్పుబట్టారు. దీని వలన రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ ప్రభుత్వ ఆసుపత్రికి రారని హితవు పలికారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయంపై పునరాలోచించాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరు ప్రైవేటు ఆసుపత్రికే వెళ్లటం మెుదలుపెడతారని... దీంతో ప్రభుత్వ ఆసుపత్రులో ఈగలు తోలుకోవాల్సి వస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఆర్టీపీపీ భవితవ్యం ప్రశ్నార్థకం