పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లిలో పార్టీ నేతలతో కలిసి ఆటోకు తాడుకట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు.
ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తులసిరెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం విధించిన అదనపు వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని సూచించారు.
ఇదీ చదవండి:
Black Fungus: విశాఖ కేజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన వైద్యం