కడప జిల్లాలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పుల్లంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ మేరకు కడపలోని పోలీస్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అరెస్టు అయిన వారిలో అటవీశాఖ అధికారి ఒకరు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
'అటవీ శాఖలో ప్రొటెక్షన్ వాచర్గా పని చేస్తున్న శివాంజనేయ రెడ్డి.. ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా చేయించేవాడు. ఇద్దరు స్మగ్లర్లు.. కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి శివాంజనేయ రెడ్డితోపాటు మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5 వేల నగదుతోపాటు ఓ కారును సీజ్ చేశాం' అని ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మహిళపై కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్... పరిస్థితి విషమం