ETV Bharat / state

Three Family Members Died in Road Accident: అంత్యక్రియలకు వెళ్లొస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Three Family Members Died in Road Accident: నిద్రమత్తుకి తోడు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం ఆ కుటుంబాన్ని మృత్యు ఒడిలోకి నెట్టింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లిన కొండేటి కృష్ణ కుటుంబం.. తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Three Family Members Died in Road Accident

author img

By

Published : Aug 21, 2023, 2:04 PM IST

Three Family Members Died in Road Accident: వైఎస్సార్ జిల్లా చెన్నూరు సమీపంలో.. కడప - కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన కొండేటి కృష్ణ (40), ఆయన అత్త అన్నే పద్మావతి (61), కుమారుడు రిషి (15) అక్కడిక్కడే మృతి చెందారు. కుమార్తె నిహారిక (16), భార్య విజయరాణి (38) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

తిరుపతికి చెందిన కృష్ణ కొంతకాలంగా హైదరాబాద్​ ప్రాంతంలోని ఖైరతాబాద్‌ సమీప ప్రేమ్​నగర్​లో స్థిరపడ్డారు. ఈ నెల 18వ తేదీన కృష్ణ తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తిరుపతిలోని బైరాగిపట్టెడకు వెళ్లారు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తైన తరువాత ఆదివారం ఉదయం తిరిగి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గ మధ్యలో మధ్యాహ్నం 12.30 సమయంలో చెన్నూరు సమీపంలోకి రాగేనే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు అతివేగంతో ఢీకొట్టింది.

One Year boy Died in Car Accident: కారు ఢీకొని చిన్నారి మృతి.. అక్కడ ఖననం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు...

కారు నడుపుతున్న కృష్ణతో పాటు, ఆయన పక్క సీటులో కూర్చున్న పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లలో కూర్చున్న భార్య విజయరాణి, కుమార్తె నిహారిక, కుమారుడు రిషి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రిషి మరణించాడు. గాయపడిన మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిహారిక ఇంటర్మీడియట్ పూర్తిచేయగా, రిషి పదవ తరగతి చదువుతున్నాడు. కృష్ణ అత్త పద్మావతిది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి కాగా.. ఆమె హైదరాబాద్‌లోని కుమారుడి వద్ద ఉంటున్నారు.

కుమార్తె కుటుంబంతో పాటు వెళ్లిన పద్మావతి మరణించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాసులరెడ్డి, పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Visakha Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డీవైడర్​ను, చెట్టును ఢీకొట్టి.. బైక్​ను సైతం.. ముగ్గురి మృతి

రెండు ప్రాంతాలలో విషాదఛాయలు: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌, ఆనంద్‌నగర్‌ కాలనీలలో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ రెండు ప్రాంతాలలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆనంద్‌నగర్‌ కాలనీలో ఉండే కొండేటి కృష్ణ, విజయరాణి దంపతులు ప్రైవేటు ఉద్యోగులు కాగా మూడు రోజుల క్రితం కృష్ణ తండ్రి తిరుపతిలోని బైరాగిపట్టెడలో చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియల కోసం ఈ నెల 18వ తేదీన సాయంత్రం కృష్ణ దంపతులు, వారి కుమారుడు, కుమార్తెతో పాటు ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న అత్త అన్నె పద్మావతి (61) కారులో వెళ్లారు.

తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా కడప నగర శివారు చెన్నూరు వద్ద ప్రమాదం జరిగి కృష్ణ, అతని కొడుకు రుషి, అత్త పద్మావతి చనిపోయారనే వార్త రెండు అపార్టుమెంట్లలోనూ విషాదం నింపింది. ఇద్దరి నివాసాలు పక్క పక్క కాలనీల్లోనే ఉండటంతో పిల్లలందరూ తరుచూ వస్తూ పోతూ అందరితో కలివిడిగా ఉండే వారని అపార్టుమెంట్​వాసులు పేర్కొన్నారు. మరణవార్త విని ఆ బాధతో వెళ్లిన వారు అనూహ్యంగా ఇలా మృతి చెందడంతో తమకు మరింత దుఃఖాన్ని మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

Today Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మద్యం మత్తే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.