కడప జిల్లా ముద్దనూరులో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి దాదాపు 2 లక్షల 50 వేల రూపాయల విలువైన మద్యం సీసాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఎక్సైజ్ సీఐ నాగేంద్రమ్మ అక్కడికి చేరుకుని పరిశీలించారు. దుకాణం వెనుక వైపు నుంచి తాళాలు పగులగొట్టి మద్యం దొంగిలించినట్లు గుర్తించారు. చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితమే ముద్దనూరులో మరో ప్రభుత్వ దుకాణంలో రూ.70 వేల విలువైన మద్యం బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
ఇదీ చూడండి:
కడప జిల్లా వేంపల్లిలో అగ్నిప్రమాదం