ETV Bharat / state

బద్వేలులో దొంగ అరెస్ట్... భారీగా వెండి ఆభరణాలు స్వాధీనం - బద్వేలులో దొంగ అరెస్ట్ తాజా వార్తలు

కడప జిల్లా బద్వేలులో వెండిని విక్రయానికి తీసుకెళ్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతను బస్సులోని ఓ వ్యక్తి నుంచి వెండి అభరణాల బ్యాగును కొట్టేశాడు.

thief arrest at badhvel
బద్వేలులో దొంగ అరెస్ట్
author img

By

Published : Nov 22, 2020, 9:11 AM IST

కడప జిల్లా బద్వేలులో.. వెండి అభరణాలను దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19వ తేదీన కడప నుంచి బద్వేలు ఆర్టీసీ బస్టాండ్​కు వెళ్లిన అలీ హుస్సేన్.. నెల్లూరు బస్సు ఎక్కాడు. ముందు సీట్లో ఉన్న వ్యక్తి నుంచి వెండి ఆభరణాలు ఉన్న సంచిని తీసుకొని బస్సు దిగి వెళ్లాడు.

వాటిని విక్రయించడానికి నెల్లూరు పట్టణానికి తీసుకెళ్తుండగా... పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అతని దగ్గర సంచి కనబడగా సీఐ రమేష్ వివరాలు ఆరా తీశారు. వెండి ఆభరణాలు ఎవరివో తెలీదని... అవి లక్ష రూపాయలు ఉంటాయని చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని సీఐ వెల్లడించారు.

ఇదీ చూడండి:

'ఇది ప్రజాస్వామ్యమా?... పోలీసు రాజ్యమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.