కడప జిల్లా యర్రగుంట్ల ఆర్టీపీపీ క్వార్టర్స్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్టీపీపీలో విధులు నిర్వహిస్తున్న మిట్ట సుబ్రమణ్యం.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి.. ఇంటి తాళాలు పగలగొట్టిన ఉండటం గమనించిన సుబ్రహ్మణ్యం లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తాళాలు పగలగొట్టి అందులోని.. 20తులాల బంగారం, 6కిలోల వెండి, రూ.40లక్షల నగదు అపరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: