కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడు గ్రామంలో ఉపాధి పనిచేస్తూ.. మొగిలి వెంకటమ్మ అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ పనికి వెళ్లిన మొగిలి వెంకటమ్మ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. గమనించిన ఎఫ్ఏ కుల్లాయప్ప వెంటనే ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వెంకటమ్మ చనిపోయినట్లు నిర్ధరించారు. మృతురాలికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. వెంకటమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి..