ETV Bharat / state

కడప పీఎంకేవీవైలో.... యువత ఉత్తమ భవిష్యత్తుకు బాటలు - PMKVY Center

నిరుపేద, గ్రామీణ యువత ప్రతిభకు.. నైపుణ్యాలు జత కలిస్తే.. అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా రాణించగలరు. సొంతకాళ్ల మీద నిలబడటమే కాక.. తమలాంటి యువత ఉపాధికి భరోసా అందించగలరు. చేయాల్సిందల్లా వారికి కావాల్సిన నైపుణ్యాలు అందించటమే. ఆ పని సమర్థంగా నిర్వహిస్తోంది.. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం. డిగ్రీలున్నా.. నైపుణ్యాల లేమితో ఉపాధికి దూరమవుతున్న కడప జిల్లా యువతకు ఈ కౌశల్ వికాస్ యోజన కేంద్రం మెరుగైన భవిష్యత్తు అందిస్తోంది

పీఎంకేవీవై
పీఎంకేవీవై
author img

By

Published : Apr 11, 2021, 7:20 AM IST

పీఎంకేవీవై: వేలాది యువత ఉత్తమ భవిష్యత్తుకు బాటలు

బీటెక్ అయినా...ఎంటెక్ అయినా...కార్పొరేట్ కొలువు దక్కాలంటే మెరుగైన నైపుణ్యాలు తప్పనిసరి. సంస్థలు కోరుకునే ప్రతిభ ఉన్న వారికే ఉపాధి. మిగిలిన వారి ఉద్యోగాన్వేషణలో అనేక అవస్థలు. అలాంటివారికి ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాలు. దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిల్లో యువతకు నైపుణ్యాలకు సాన బెడుతున్నాయి. ఇదేరీతిలో కడప ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రం ..వేలాది యువత ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.

కడప జిల్లా కేంద్రంగా 2018 మే 5 న ఏర్పాటైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రం ఇప్పటివరకూ సుమారు 3 వేల మంది నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించింది. ఈ కేంద్రంలో తర్ఫీదు పొందిన విద్యార్థులకు నేషనల్ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్లూ అందజేస్తోంది. స్థానికంగా శిక్షణ పొందిన యువతలో దాదాపు 50% మంది కార్పొరేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు.

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రంలో ప్రధానంగా 5 విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. 5వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన నిరుద్యోగ యువతకు .. ఐటీఐ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సోలార్ పీవీ ఇన్‌స్టలేషన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ ఫోన్ హార్డ్‌వేర్, రిపేర్ టెక్నీషియన్ విభాగాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు.

సాంకేతిక అంశాలపై ఆసక్తి చూపే నిరుద్యోగ యువతకు జావా, C ప్లస్‌- ప్లస్‌, ఫోటోషాప్‌, వెబ్‌ డిజైనింగ్ వంటి వివిధ రకాల కంప్యూటర్ ఆధారిత అంశాల్ని నేర్పిస్తున్నారు. ఈ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్నవారు బెంగళూరు, చెన్నై ప్రైవేటుసంస్థల్లో కొలువులు దక్కించుకున్నారు.

పదోతరగతి, ఇంటర్‌తో చదువు ఆపేసిన యువతులు టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఉచిత శిక్షణతో సరికొత్త మెళకువలు నేర్చుకుని సొంతంగా టైలరింగ్ దుకాణాలు నిర్వహించే స్థాయికి చేరుతున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేయకపోయినా.. ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన శిక్షణ ఎంతగానో ఉపయోగ పడుతుందని యువతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నైపుణ్యాల లేమితో పోటీ ప్రపంచంలో వెనుకపడిపోతున్న నిరుద్యోగ యువతకు శిక్షణకు ఈ కేంద్రం ఒక్కో విద్యార్థికి 10 నుంచి 12 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. అనుభవం ఉన్న అధ్యాపకుల్ని ఎంపిక చేసుకుని.. నాణ్యమైన కోర్సులు అందిస్తోంది. కడప ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాన్ని నిర్వహిస్తున్న సింక్రో సంస్థ.. శిక్షణ తీసుకున్న యువతకు వందశాతం ఉపాధిఅవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. వాటి ఫలితమే మార్చి నెల లోనే ఇక్కడ తర్ఫీదు పొందిన 120 మందికి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి.

ఈ నైపుణ్యా శిక్షణా తరగతులు.. కన్నవారి కలల్ని నిజం చేస్తూ.. కార్పొరేట్ కొలువు సాధించేందుకు కొంతమందికి ఉపయోగపడితే...కుటుంబసభ్యులపై ఆధారపడకుండా సొంతంగా తమ కాళ్ల పై తాము నిలబడేందుకు మరికొంతమందికి దోహదపడుతున్నాయి. దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగ సమస్యను కొంతమేరకు తగ్గించేందుకు వారధిగా నిలుస్తున్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.