ETV Bharat / state

పరిమితంగా మందుల దుకాణాలు.. ప్రజల అవస్థలు

కడప నగరంలోని మందుల షాపుల ముందు జనాలు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యలో షాపులు తెరవడం వల్ల మందులు దొరకటం కష్టంగా మారిందని గగ్గోలు పెడుతున్నారు.

kadapa district
పరిమిత మందుల దుకాణాలు..ప్రజల అవస్థలు
author img

By

Published : May 7, 2020, 8:16 PM IST

కడప నగరంలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో 14 మందుల దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ తెరిస్తేనే ప్రజలకు మందులు దొరకడం కష్టంగా ఉండేది. అలాంటిది కేవలం ఒక రోజు ఏడు, ఇంకొకరోజు మరో ఏడు తెరవాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిమిత సంఖ్యలోని మందుల దుకాణాల వద్ద ప్రజలు మందుల కోసం బారులు తీరారు.

గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలబడిన వ్యక్తి మందుల దుకాణం వద్దకు వెళ్ళిన తర్వాత ఆ మందులు లేవని చెబుతున్న కారణంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు సడలించాలని ప్రజలు కోరారు.

ఇదీ చదవండి:

'మరింత పటిష్ఠంగా కరోనా నివారణ చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.