కడప జిల్లా జమ్మలమడుగులో ఉల్లి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో ధర వందకు తగ్గకపోవటంతో.. రాయితీ ఉల్లి తీసుకునేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. కిలో రూ.25 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేస్తోంది. ఆదివారం విక్రయాలు ప్రారంభించటంతో వేలాదిమంది మహిళలు ఉదయం నుంచి వరుసలో నిలబడ్డారు. ఒక్క ఆధార్ కార్డుకు కిలో మాత్రమే ఇవ్వటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలానికో కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి కష్టాలు తీర్చాలని కోరారు.
ఇదీ చదవండి: నూజివీడు ఇండోర్ స్టేడియం కల నెరవేరేనా..?