చివరి ప్రయత్నమూ ఫలించలేదు
ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చివరి ప్రయత్నంగా 2006లో నూజివీడులో తిరువూరు రోడ్డు మార్గంలో స్థలాన్ని కేటాయించారు. అయితే ఇది ఓ ప్రముఖ నటుడికి చెందిన స్థలం కావడం వల్ల అభ్యంతరాలు వచ్చాయి. ఇది కూడా అర్ధంతరంగా నిలిచిపోయింది. స్టేడియం నిర్మాణంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ప్రతిభను ప్రోత్సహించండి
నూజివీడు నుంచి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడి అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడల కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 1970 - 80 మధ్యలో నూజివీడు నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పతకాలు పొందిన చాలా మంది ఇదే ప్రాంతంలో స్థిరపడ్డారు. మధ్యలో నిలిచిపోయిన స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చూడండి:
దక్షిణాఫ్రికాతో పోలిక సరైనదేనా..? ప్రభుత్వ చర్యలతో ప్రగతి ఎంత నిజం?