లాక్ డౌన్ వల్ల రవాణ వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎగుమతికి అనుమతులు లభించకపోవటంతో రైతులతోపాటు లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడపజిల్లా పులివెందులలో అరటి,చీని పంటల రవాణాకు సరైన సదుపాయాలు లేవు. ఎగుమతులు నిలిచిపోవటంతో రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లు పులివెందులలో సేద తీరుతున్నారు. హోటళ్లు లేక చెట్లకింద వంట చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. వీరిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీ అందిస్తారు.
ఇవీ చదవండి: వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించండి: సీఎం జగన్