వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన సీబీఐ విచారణ కడపలో ప్రారంభమైంది. నిన్నటి వరకు పులివెందులలోని వైఎస్ వివేకానంద రెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న అతిథిగృహం, ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. హత్య కేసుకు సంబంధించి అనుమానితులుగా ఉన్న ఆరుగురిని విచారిస్తున్నారు. వీరిలో ఎస్పీ హోదా ఉన్న ఓ మహిళ ఉండటం గమనార్హం. అనుమానితుల నుంచి సీబీఐ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నిర్వాసితుల పోరాటానికి తెదేపా, భాజపా నేతల మద్దతు