కడప జిల్లా కాశినాయన మండలం నర్సాపురం గ్రామంలో తెలుగుదేశం నాయకుడు వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ సచివాలయం నిర్మాణ విషయంలో ఎమ్మెల్సీ గోవింద్రెడ్డిని అడ్డుకున్న ఘటనకు సంబంధించి ఇదివరలో ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తన ఇష్టపూర్వకంగా కేటాయించిన స్థలంలో గ్రామ సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంకట్ రెడ్డి అరెస్టు అన్యాయం అంటూ కొందరు ఆ పార్టీకి చెందిన శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి