కడప జిల్లా అయ్యవారిపల్లె పరిధి రాజువారిపేటలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిని రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వృద్ధురాలు రాగా అధికారులు బ్యాలెట్ పేపరును జారీ చేశారు.
ఆమె ఓటు వేసి పెట్టెలో వేయాలంటూ ఎన్నికల సిబ్బందిని కోరారు. అదే సమయంలో అక్కడే ఉన్న తెదేపా అభ్యర్థిని.. మీరెలా ఓటు వేస్తారంటూ బ్యాలెట్ పేపరును లాక్కున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం నెలకొంది. అనంతరం బ్యాలెట్ పేపర్తో బయటకు వచ్చారని ఆరోపిస్తూ.. తెదేపా అభ్యర్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: